- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరూర్ తొక్కిసలాట ఘటనపై CBI విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటన(Karur Stampede Incident)పై విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటన(Karur Stampede Incident)పై విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగబోతోంది. ఘటనపై సీబీఐ విచారణకు తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురి సభ్యులను నియమించింది. కాగా, టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. మరోవైపు తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు టీవీకే పార్టీ అధినేతతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేశాయి.






