- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీధి కుక్కల కేసు విచారణ.. తదుపరి ఆదేశాలపై ‘సుప్రీం’ కీలక ప్రకటన
వీధి కుక్కల కేసు (Stray Dog Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: వీధి కుక్కల కేసు (Stray Dog Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జంతు సంక్షేమం, ప్రజా భద్రతల మధ్య సమతుల్యత కాపాడేందుకు దాఖలైన పిటిషన్‌పై ఇవాళ మరోసారి జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కేసులో తదుపరి ఆదేశాలను నవంబర్ 7న వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా ఆయా రాష్ట్రాల సీఎస్‌లు వ్యక్తిగతంగా హాజరు అవ్వడంపై మినహాయింపు నిచ్చారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాను పిటిషనర్‌గా చేర్చాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించారు.
Next Story






