- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: డ్రైవర్ల పని గంటలపై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు
రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో డ్రైవర్లకు పని గంటలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ప్రతియేటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్రైవర్లకు పని గంటల విధానం (working hours for drivers) అమలుపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు సూచించింది. రోడ్డు ప్రమాద బాధితులకు ఒక ప్రోటోకాల్ అమలులో ఉండాలని కోరుతూ న్యాయవాది కిషన్ చంద్ జైన్ దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సత్వరమే చికిత్స అందించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాతాలను ఆదేశించింది. ఇందుకోసం ఆరు నెలల గడువును విధించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదాల్లో గాయపడిన వారిలో చాలా మందికి సత్వర చికిత్స అందడం లేదు. ఇంకా కొన్ని ఘటనల్లో గాయపడకపోయినా వాహనాల్లోనే చిక్కుకుపోతున్నరు. వీరికి వేగంగా సాయం అందించే విధంగా ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాలు నిబంధనలు రూపొందించాలని వ్యాఖ్యానించింది.






