భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారు.. ఫ్రీ స్కీమ్‍లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-02-19 07:24:18  IST  )

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారు.. ఫ్రీ స్కీమ్‍లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాల పేరుతో (Freebie Schemes) వృథా ఖర్చు, ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతోందని వ్యాఖ్యానించింది. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని పేర్కొంది. భూస్వాములకు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారని ఈ ఖర్చు మొత్తం ప్రజలు చెల్లించిన పన్నుల సొమ్మే కదా అని ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల పంపిణీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‍పై ఇవాళ విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నష్టాల్లో ఉన్న రాష్ట్రాలు కూడా ఉచితాలు కొనసాగిస్తున్నాయని రెవెన్యూ లోటు కారణంగా అభివృద్ధికి నిధులు సరిపోవని పేర్కొంది. రాష్ట్రాల ఆదాయం జీతాలు, ఉచితాలకే సరిపోతోందని సీజేఐ జస్టిస్ సూర్యాకాంత్ వ్యాఖ్యానించారు. ఉచిత పథకాలపై నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది

Next Story