Supreme Court: బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వండి.. ఇండ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఆదేశాలు

by Prasad Jukanti |   (  Updated:2025-04-01 09:13:51  IST  )

ఇండ్ల కూల్చివేత ఫ్యాషన్ కాకూడదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది.

Supreme Court:  బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వండి.. ఇండ్ల కూల్చివేతలపై  సుప్రీంకోర్టు ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీలోని యోగి సర్కార్ (UP government) బుల్డోజర్ యాక్షన్ (Bulldozer action) పై సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్ కామెంట్స్ చేసింది. నివాస భవనాల కూల్చివేతలు అమానవీయం, చట్టవిరుద్ధం అని జస్టిస్ అభయ్ ఎస్ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. 2021 లో ప్రయాగ్ రాజ్ లోని ఒక న్యాయవాది, ఒక ప్రొఫెసర్ తో పాటు మరో ముగ్గురి ఇళ్లను ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేసిన (Prayag Raj demolitions) కేసులో సుప్రీంకోర్టు ఈవాళ విచారణ జరిగిపింది. ఈ సందర్భంగా యూపీ సర్కార్ కూల్చివేతలు దిగ్భ్రాంతికరం అని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితులకు ఆశ్రయం పొందే హక్కు లేదా? అని ప్రశ్నించింది. ఆశ్రయం పొందే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో అంతర్భాగమని అధికారులు గుర్తించుకోవాలంది. దేశంలో రూల్ ఆఫ్ లా అంటూ ఒకటి ఉంటుందని నివాస భవనాల కూల్చివేత ఫ్యాషన్ గా మారకూడదని కోర్టు అభిప్రాయపడింది. బాధితులకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీని ఆదేశించింది. ఆరు వారాల్లో పరిహారం చెల్లింపు జరగాలని ఆదేశించింది.

పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమ ఇళ్లు నిర్మించుకున్న భూమిని హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కు చెందినదిగా అధికారులు పొరపాటున గుర్తించారని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా కూల్చివేత నోటీసులు అందజేసిన తీరుపై అధికారులను కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తుల వద్ద నోటీసులు అతికించారని ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపారని కోర్టు ప్రశ్నించింది. ఈ అక్రమ కట్టడాల వ్యాపారాన్ని ఆపాలి. దీనివల్ల వారు తమ ఇళ్లను కోల్పోయారని కోర్టు అధికారుల మండిపడింది. ప్రతి కేసులో బాధితులకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించండి. అలా చేయడం ద్వారా ఈ అధికారం ఎప్పుడూ తగిన ప్రక్రియను అనుసరించాలని గుర్తించుకుంటుందని కోర్టు పేర్కొంది.

Next Story