ఈసీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. SIR పై సంచలన తీర్పు

by Prasad Jukanti |

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది.

ఈసీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. SIR పై సంచలన తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల కమిషన్‌కు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహించే అధికారం ఉందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారులు ఉన్నాయి ఎస్ఐఆర్ విషయంలో ఎన్నికల సంఘం అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. SIR ప్రక్రియ చట్టాలకు గానీ, రాజ్యాంగ నిబంధనలకు గానీ విరుద్ధం కాదని స్పష్టం చేసింది. SIR చేపట్టాలన్న భారత ఎన్నికల సంఘం (ECI) నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం, ఈ ఏడాది ప్రారంభంలో విస్తృత విచారణల అనంతరం ఈ విషయంలో తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ తీర్పును వెలువరించింది. ఖచ్చితమైన, సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు SIR ఒక కీలక అడుగు అని సుప్రీంకోర్టు పేర్కొంది.ఈ ప్రక్రియ రాజ్యాంగానికి కొత్త ఊపిరి పోసే చర్యగా అభివర్ణిస్తూ ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను, విశ్వసనీయతను బలోపేతం చేస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ గ్రీన్ సిగ్నల్ పడినట్లైంది.

Next Story