వొడాఫోన్‌ ఐడియాకు సుప్రీంకోర్టు ఊరట.. ఏజీఆర్‌ డిమాండ్లపై పునఃపరిశీలనకు అనుమతి

by Malleboina Mahesh |   (  Updated:2025-10-27 06:58:22  IST  )

టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియాకు సుప్రీంకోర్టు పెద్ద ఉపశమనం కలిగించింది.

వొడాఫోన్‌ ఐడియాకు సుప్రీంకోర్టు ఊరట.. ఏజీఆర్‌ డిమాండ్లపై పునఃపరిశీలనకు అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్: టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea)కు సుప్రీంకోర్టు పెద్ద ఉపశమనం కలిగించింది. 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు టెలికమ్యూనికేషన్స్‌ విభాగం (DoT) లేవనెత్తిన అదనపు ఏజీఆర్‌ (Adjusted Gross Revenue) డిమాండ్ల అంశాన్ని పునఃపరిశీలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. వొడాఫోన్‌ ఐడియా లేవనెత్తిన వివాదాస్పద బకాయిలపై ప్రభుత్వం పునఃపరిశీలన అవసరమని కోర్టులో సమర్పించిన వాదనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

కేంద్రం కోర్టుకు తెలిపిన ప్రకారం.. వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని, అలాగే 20 కోట్ల మంది వినియోగదారులు ఈ కంపెనీ ద్వారా సేవలు పొందుతున్నారని పేర్కొంది. కంపెనీపై ఆర్థిక ఒత్తిడి కొనసాగితే లక్షలాది ఉద్యోగాలు, వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతింటాయని కేంద్రం వాదించింది. అందువల్ల ఈ అంశం ప్రభుత్వ విధాన పరిధిలోకి వస్తుందని, పునఃపరిశీలన అవసరమని సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ఈ నిర్ణయం వొడాఫోన్‌ ఐడియాకు పెద్ద ఊరటగా మారింది.

Next Story