- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగ్గురు సుప్రీంకోర్టు కొత్త జడ్జీల నియామకం
ముగ్గురు సుప్రీంకోర్టు కొత్త జడ్జీల నియామకం. కొలీజియం ప్రతిపాదనలకు అనుమతి లభించడంతో నియమించిన కేంద్రం.

X
దిశ, నేషనల్ బ్యూరో: దేశ అత్యున్నత న్యాయస్థానంలో ముగ్గురు కొత్త జడ్జీల నియామకం జరిగింది. రాష్ట్రపతి అనుమతితో కొలీజియం ప్రతిపాదనలను అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ అంజారియా, గౌహతి హైకోర్టు చీప్ జస్టిస్ విజయ్ బిష్ణోయి, బాంబే హైకోర్టు జడ్జి ఏఎస్ చందూర్కర్.. ముగ్గుర్నీ సుప్రీంకోర్టులో జడ్జీలుగా నియమించినట్లు కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటించారు. శుక్రవారం నాడు ఈ ముగ్గురితో సీజేఐ బీఆర్ గవాయ్ ప్రమాణం చేయించనున్నారు. కాగా, ఇటీవలే సుప్రీంకోర్టు మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ హృషికేష్ రాయ్ రిటైరయిన సంగతి తెలిసిందే. ఈ స్థానాలను భర్తీ చేయడం కోసం ముగ్గరు కొత్త జడ్జీలను కొలీజియం ప్రతిపాదించింది.
Next Story






