సివిల్ కేసులో క్రిమినల్ చట్టాలు.. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

by Naga Rani Yarlagadda |

సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మారుస్తూ.. అలహాబాద్ హైకోర్టు (Alahabad High Court) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సివిల్ కేసులో క్రిమినల్ చట్టాలు.. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మారుస్తూ.. అలహాబాద్ హైకోర్టు (Alahabad High Court) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసు (Civil Case)ను విచారించి పరిష్కరించేందుకు సమయం ఎక్కువ పడుతుందన్న కారణంతో క్రిమినల్ కేసుగా మార్చడాన్ని హైకోర్టు సమర్థించడం పట్ల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సివిల్ కేసుల్ని పరిష్కరించేందుకు క్రిమినల్ చట్టాలను ఉపయోగించలేమన్న చట్టపరమైన నిబంధనల్ని ఇరు కేసుల మధ్యనున్న తేడాను హైకోర్టు అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నామని సుప్రీం ధర్మాసనం (Supreme Court) పేర్కొంది. ఇకపై న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూస్కోవాలని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

Next Story