న్యాయవ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం.. సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్

by Prasad Jukanti |

ఎన్‍సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థ అవినీతి పాఠ్యాంశాన్ని పొందుపరచడాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది

న్యాయవ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం.. సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యాయవ్యవస్థ అవినీతిని ఎన్‍సీఈఆర్‍టీ పాఠ్యపుస్తకంలో పొందుపరచడంపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవస్థ ప్రతిష్ఠకు ఎవరు భంగం కల్పించిన సహించోమని సీజేఐ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. ఎన్‍సీఈఆర్‍టీ పుస్తకాల్లో న్యాయవ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం పెట్టడాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ దయచేసి కొన్ని రోజులు వేచి ఉండండి. ఈ అంశంపై బార్ అండ్ బెంచ్ అందరూ కలవరపడ్డారు. హైకోర్టు న్యాయమూర్తులందరూ కలవరపడ్డారు. నేను ఈ విషయాన్ని స్వయంగా తీసుకుంటాను. సంస్థను కించపరచడానికి నేను ఎవరినీ అనుమతించను. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఈ సందర్భంగాసీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ స్పందిస్తూ ఎన్సీఆర్టీ పిల్లలకు న్యాయవస్థలో అవినీతి గురించి చెప్పడం తీవ్రమైన అంశం అన్నారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Next Story