- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుస్తులు విప్పడం, అసభ్యంగా తాకడం అత్యాచారయత్నమే.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దుస్తులు విప్పే ప్రయత్నం చేయడం, అసభ్యకరంగా తాకడం కూడా అత్యాచారయత్నమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. తాకడం, పైజామాను విప్పడం, కల్వర్టు కిందకు లాగడం అత్యాచారం, అత్యాచారయత్నం కాదు అంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును రద్దు చేయాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది.

దిశ, వెబ్ డెస్క్: దుస్తులు విప్పే ప్రయత్నం చేయడం, అసభ్యకరంగా తాకడం కూడా అత్యాచారయత్నమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. తాకడం, పైజామాను విప్పడం, కల్వర్టు కిందకు లాగడం అత్యాచారం, అత్యాచారయత్నం కాదు అంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును రద్దు చేయాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్ మల్య బాగ్చి, ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక నేరాల కేసుల్లో తీర్పు ఇచ్చేటప్పుడు కోర్టులకు చట్టపరమైన ఆధారాలతో పాటు సానుభూతి కూడా అవసరం అని స్పష్టం చేసింది.
పవన్, ఆకాష్ అనే ఇద్దరు నిందితులు 11 ఏళ్ల బాలికను ఓ కల్వర్టు కిందకు తీసుకువెళ్లి ఆమె శరీర భాగాలను తాకుతూ బాలిక పైజామా విప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన కొందరు అడ్డగించి పోలీసులకు అప్పగించారు. ట్రయల్ కోర్టు వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది. నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా కీలక తీర్పునిచ్చారు. బాలిక దుస్తులు విప్పుతూ పట్టుబడిన వెంటనే నిందితులు పారిపోయారని, అత్యాచార నేరానికి పాల్పడ్డారని సూచించడానికి ఎలాంటి ఆధారాలు లేవని మిశ్రా అన్నారు. అత్యాచారయత్నం చేశారని చెప్పడానికి ఈ ఆధారాలు సరిపోవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అలహాబాద్ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం మొట్టికాయలు వేసింది.






