Supreme court: వాట్సప్ ద్వారా నోటీసులు అందించొద్దు.. పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

by B.Srinivas |

వాట్సాప్ ద్వారా నిందితులకు పోలీసులు నోటీసులు అందించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది.

Supreme court: వాట్సప్ ద్వారా నోటీసులు అందించొద్దు.. పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: వాట్సాప్ (Whats app) ద్వారా నిందితులకు పోలీసులు నోటీసులు అందించొద్దని సుప్రీంకోర్టు (Supreme court) తెలిపింది. సీఆర్‌పీసీ (Crpc) సెక్షన్ 41ఏ, బీఎన్ఎస్ఎస్ (Bnss) సెక్షన్ 35 కింద నిందితులకు నోటీసులు అందజేయడానికి వాట్సప్, మరేదైనా ఎలక్ట్రానిక్ మోడ్‌ను ఉపయోగించొద్దని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పోలీసు యంత్రాంగానికి స్టాండింగ్ ఆర్డర్ జారీ చేయాలని సూచించింది. సతీందర్ కుమార్ (Sathinder kumar) యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆర్డర్స్ జారీ చేసింది. సీఆర్‌పీసీ, బీఎన్ఎస్ఎస్ కింద సూచించిన నిర్ణీత పద్ధతి ప్రకారం మాత్రమే నోటీసు అందజేయాలని తెలిపింది. వాట్సప్, ఇతర ఎలక్ట్రానిక్ మార్గాలను ఉపయోగించడం ప్రత్యామ్నాయ పద్ధతి కాదని స్పష్టం చేసింది. అలా చేస్తే నోటీసు పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని అన్ని పోలీసు శాఖల్లో తప్పకుండా అమలు చేయాలని తెలిపింది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాల అమలును నెలవారీగా నిర్ధారించడానికి అన్ని హైకోర్టులు తమ తమ కమిటీల సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపింది.

Next Story