- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దగ్గు మందు ఘటనపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
దగ్గు మందు కారణంగా దాదాపు 20 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: దగ్గు మందు కారణంగా దాదాపు 20 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇప్పటికే కోల్డ్‌రిఫ్ (Coldrif) కాఫ్ సిరప్ తో పాటు మరో రెండు దగ్గు మందులపై నిషేధం విధించాయి. అయితే వరుసగా 20 మంది పిల్లలు చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో కాఫ్ సిరప్ ఘటనపై సుప్రీం కోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్ ను ఈ రోజు సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేసింది.
ఈ కేసులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఔషధ నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో మరోసారి న్యాయపరమైన జోక్యం అవసరం లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. పిటిషన్ దాఖలు చేసిన వారు కోరిన విధంగా కొత్త విచారణ, ప్రత్యేక పరిశీలనకు అవసరమైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మందుల నాణ్యత నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థలను అప్రమత్తం చేయాలని ఆదేశించిందని సొలిసిటర్ జనరల్ చెప్పుకొచ్చారు.






