BIG BREAKING: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-25 06:26:03  IST  )

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

BIG BREAKING: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ఇరు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని ప్రొఫెసర్ పురుషోత్తం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం.. తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజించాలని పిటిషనర్ కోరారు. సెక్షన్ 26కి పరిమితి ఉందన్న సూర్యకాంత్ ధర్మాసనం.. 2026లో జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని తెలిపింది.

జమ్మూకశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్ ఆరోపించగా ఆ ఆరోపణలను ధర్మాసనం తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఆంధ్ర, తెలంగాణలను మినహాయించడం ఏకపక్షం, వివక్ష కాదని స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్ ను అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లోనూ ఇవే తరహా పిటిషన్లు వస్తాయని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

Next Story