పోర్న్‌సైట్లలో అమ్మకానికి 20 కోట్ల వీడియోలు.. నేపాల్‌ను ఉదాహరణగా చూపిన సుప్రీంకోర్టు

by Naga Rani Yarlagadda |

ఇంటర్నెట్ లో అశ్లీల కంటెంట్ రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

పోర్న్‌సైట్లలో అమ్మకానికి 20 కోట్ల వీడియోలు.. నేపాల్‌ను ఉదాహరణగా చూపిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నెట్ లో అశ్లీల కంటెంట్ రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ కంటెంట్ వీడియోలు, క్లిప్పులు పిల్లల మనసుల్ని మలినం చేస్తున్నాయని, తీవ్ర దుష్పరిణామాలకు కారణవుతాయని పిటిషనర్ పిటిషన్ లో ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషన్ ను పరిశీలించిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇంటర్నెట్ లో పలు సైట్లపై నిషేధం విధించడం వల్ల నేపాల్ లో చోటుచేసుకున్న పరిణామాలు చూశారు కదా అని పిటిషనర్ ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్ ను ఇప్పటికిప్పుడు విచారించలేమని పేర్కొంటూ 4 వారాలకు వాయిదా వేసింది. ఈనెల 23న సీజేఐ పదవీ విరమణ చేయనుండగా.. ఈ పిటిషన్ పై విచారణకు ఆయన సుముఖంగా లేనట్లు న్యాయవర్గాల అభిప్రాయపడ్డాయి.

ఇక పిటిషనర్ వేసిన పిటిషన్ లో పలు అంశాలను ప్రధానంగా పేర్కొన్నాడు. డిజిటలైజేషన్ తర్వాత దేశంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిందని, అక్షరాస్యత, చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ నెట్ వాడుతున్నారని చెప్పాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని 69ఏ ఆర్టికల్ ప్రకారం అశ్లీల కంటెంట్ ను ప్రోత్సహించే వెబ్ సైట్లపై నిషేధం విధించే అవకాశం ఉన్నా.. కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదని పిటిషనర్ విమర్శించారు.

Next Story