- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో రేబీస్ భయం.. ప్రపంచంలో 36 శాతం మరణాలు ఇండియాలోనే!
దేశంలో రేబీస్ భయం విపరీతంగా ఉంది. ప్రపంచంలో 36 శాతం మరణాలు ఇండియాలోనే నమోదవుతున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై జంతు ప్రేమీకుల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయతే ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో రేబీస్ కారణంగా మరణించే వారిలో 36 శాతం భారత్‌లోనే సంభవిస్తున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదే దక్షిణాసియా దేశాల వరకే చూసుకుంటే భారత్‌లోనే 65 శాతం రేబీస్ మరణాలు నమోదవుతుండటం గమనార్హం.
కుక్క కాటు వల్లనే 96 శాతం రేబీస్ కేసులు నమోదవుతున్నాయి. ఏటా భారత్‌లో కనీసం 5,700 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. అలాగే దేశంలో ప్రతిఏటా కనీసం 1.74 కోట్ల కుక్కకాటు కేసులు నమోదవుతుండగా.. వాటలో సగానికిపైగా 15 ఏళ్ల లోపు చిన్నారులవే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే ఢిల్లీ-ఎన్సీఆర్‌లో వీధికుక్కల తీవ్రత పెచ్చుమీరుతోందని భావించిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ, నోయిడా, గురుగ్రాం ప్రాంతాల్లో వచ్చే ఆరు వారాల్లో 5 వేల వీధి కుక్కలను తొలగించాలని, వాటిని స్టెరిలైజ్ చేసి శాశ్వతంగా షెల్టర్లలో ఉంచాలని ఆదేశించింది.






