- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme court: చట్టాలు రూపొందించాలని శాసనసభను కోర్టులు ఆదేశించలేవు.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
ఒక నిర్దిష్ట పద్ధతిలో చట్టాన్ని రూపొందించాలని శాసనసభను కోర్టులు ఆదేశించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఒక నిర్దిష్ట పద్ధతిలో చట్టాన్ని రూపొందించాలని శాసనసభను కోర్టులు ఆదేశించలేవని సుప్రీంకోర్టు (Supreme court) స్పష్టం చేసింది. పార్లమెంటు ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతే కొత్త చట్టాన్ని రూపొందించిందని, అసలు అధికార పరిధిలో హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానం శాసనసభను శాసనం చేయాలని ఆదేశించలేవని తెలిపింది. ఢిల్లీ హైకోర్టు గతేడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ పిటిషన్‌ను కొట్టి వేసిన బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది.
ఫిర్యాదుదారునికి, బాధితుడికి చార్జిషీట్ కాపీని ఉచితంగా అందించాలని జిల్లా కోర్టులు, పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర తరఫున హాజరైన న్యాయవాది మాట్లాడుతూ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), 2023 సెక్షన్ 230 ను ప్రస్తావిస్తూ, పిటిషన్ అసంబద్దమైందని తెలిపారు. పోలీసు నివేదికపై విచారణ ప్రారంభించిన ఏ సందర్భంలోనైనా, నిందితుడికి, బాధితుడికి మేజిస్ట్రేట్ ఉచితంగా సంబంధిత కాపీలు అందించాలని సెక్షన్ 230 నిర్దేశిస్తుందని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌ను కొట్టి వేసింది. కాగా, అన్ని జిల్లా కోర్టులు, పోలీస్ స్టేషన్లు చార్జిషీట్ తుది నివేదిక కాపీని ఫిర్యాదుదారు, బాధితునికి ఉచితంగా అందించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు కొట్టే వేసింది. దీంతో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.






