మెరుపు వరదలపై మరోసారి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

మెరుపు వరదలపై మ‌రోసారి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్ర‌మంగా చెట్లను న‌రికేయ‌డం వ‌ల్ల‌నే పంజాబ్, జ‌మ్మూక‌శ్మీర్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో మెరుపు వ‌ర‌ద‌లు ప్ర‌కృతి విల‌యం సృష్టిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించింది.

మెరుపు వరదలపై మరోసారి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మెరుపు వరదలపై మ‌రోసారి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్ర‌మంగా చెట్లను న‌రికేయ‌డం వ‌ల్ల‌నే పంజాబ్, జ‌మ్మూక‌శ్మీర్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో మెరుపు వ‌ర‌ద‌లు ప్ర‌కృతి విల‌యం సృష్టిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించింది. ఉత్త‌ర భార‌తదేశంలో కొండ ప్రాంతాల్లోని చెట్ల‌ను న‌రుకుతున్న‌ట్టుగా మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌తో స్ప‌ష్టమైన ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొంది. వ‌ర‌ద‌నీటిలో భారీగా దుంగ‌లు తేలియాడితున్న‌ట్టు వార్త‌ల్లో గ‌మ‌నించామ‌ని తెలిపింది. వ‌ర‌ద‌ల కార‌ణంగా కొండ ప్రాంతాల్లో ప‌ర్యావ‌ర‌ణం క్షీనిస్తుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

ఇది తీవ్ర‌మైన విష‌యం అని కేంద్రం మ‌రియు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెండు వారాల్లో స‌మాధానం చెప్పాల‌ని ఆదేశించింది. వెంట‌నే అధికారులు స్పందించి ఆ స్థాయిలో దుంగ‌లు తేలియాడ‌టానికి గల కార‌ణాల‌ను తెలుసుకోవాలని, రెండు వారాల త‌ర‌వాత ఈ అంశంపై తిరిగి విచార‌ణ జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇటీవ‌లే ఉత్తారాఖండ్ వ‌ర‌ద‌ల‌పైనా సుప్రీం ధ‌ర్మాస‌నం ఇలాంటి కామెంట్లే చేసింది. కొండ‌ప్రాంతాల్లో ఇల్లులు క‌ట్ట‌డం, టూరిజం కోసం కొండ‌లు త‌వ్వి భ‌వ‌నాలు, రోడ్లు నిర్మించడం వ‌ల్ల‌నే వ‌ర‌ద‌లు సంభ‌విస్తున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డింది.

Next Story