ఢిల్లీ కాలుష్యంపై ఆదేశాలు ఇవ్వలేం : సుప్రీంకోర్ట్

by Muthe.Rajitha |

ప్రతి ఏడాది వింటర్ లో దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య సమస్యలో చిక్కుకుపోయి, గాలి నాణ్యత సూచీ (AQI) 500 దాటడం సాధారణం అయింది.

ఢిల్లీ కాలుష్యంపై ఆదేశాలు ఇవ్వలేం : సుప్రీంకోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి ఏడాది వింటర్ లో దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య సమస్యలో చిక్కుకుపోయి, గాలి నాణ్యత సూచీ (AQI) 500 దాటడం సాధారణం అయింది. పెరుగుతున్న ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక పరిష్కారాలతో కాలుష్యాన్ని అరికట్టలేమని స్పష్టం చేసింది. అలాగే ఢిల్లీలో నిర్మాణాలపై నిషేధం విధించేందుకు కోర్టు నిరాకరించింది.

వేగంగా పెరుగుతోన్న కాలుష్య సమస్యను అరికట్టేందుకు సంచలన ఆదేశాలు ఇచ్చేందుకు సుముఖంగా లేదని వ్యాఖ్యానించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు దీర్ఘకాలిక పరిష్కారాలను వెతకాలని సూచిస్తూ.. నవంబర్ 19లోగా ఈ కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించే సమగ్ర ప్రణాళికతో రావాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Next Story