- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫారసు
దేశవ్యాప్తంగా ఉన్న ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవ్యవస్థ సమ్మిళితత్వాన్ని పెంపొందించడానికి, పరిపాలలను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. ఏడుగురు జడ్జిల్లో నలుగురు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు ఉండటం గమనార్హం. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఏప్రిల్ 15, 19 తేదీల్లో సమావేశమైంది. ఈ సమావేశాల తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసకుంటూ కొలీజియం తీర్మానం జారీ చేసింది. కర్ణాటక హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ చందన్ గౌడ్, జస్టిస్ కృష్ణన్ నటరాజన్, జస్టిస్ నేరనహళ్లి శ్రీనివాసన్ సంజయ్ గౌడ, జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపాద లను వరుసగా మద్రాస్, కేరళ, గుజరాత్, ఒడిశా హైకోర్టులకు బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ పెరుగు శ్రీ సుధ కర్ణాటక హైకోర్టుకు బదిలీ కాగా.. మరో న్యాయమూర్తి జస్టిస్ కసోజు సురేందర్ ను మద్రాస్ హైకోరట్క బదిలీ చేయాలని కొలీజియం ప్రతిపాదించింది. అదనంగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ కుంభజదల మన్మధరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేశారు.






