- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flash: వాన్‌పిక్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
వాన్ పిక్ (VANPIC) ప్రాజెక్టుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని వేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: వాన్ పిక్ (Vodarevu and Nizampatnam Port and Industrial Corridor-VANPIC) ప్రాజెక్టుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని వేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన విషయాలను సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకుందని, అలా ఎందుకు తీసుకుందో కారణాలు చెప్పలేదని వాన్ పిక్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ.. విచారణకు నిరాకరించింది. ఈ క్రమంలో పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
కేసు నేపథ్యం ఏంటంటే..
2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో ఈ భారీ ప్రాజెక్టును ప్రకటించారు. వోడరేవు - నిజాంపట్నం పోర్ట్ మరియు ఇండస్ట్రియల్ కారిడార్ (VANPIC) పేరుతో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రెండు ఓడరేవులు, భారీ పారిశ్రామిక ప్రాంతం నిర్మించడం దీని లక్ష్యం. దీని కోసం అరబ్ దేశమైన 'రాస్ అల్ ఖైమా' (RAK) తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీబీఐ (CBI) దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం ఈ ప్రాజెక్టులో ప్రధానంగా మూడు అంశాలు వివాదాస్పదం అయ్యాయి. సుమారు 24,000 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా, రైతులకు తక్కువ ధర ఇచ్చి వాన్‌పిక్ సంస్థకు కేటాయించారన్నది ప్రధాన ఆరోపణ.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందినందుకు ప్రతిఫలంగా, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సుమారు రూ. 850 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి కుమారుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో (సాక్షి, భారతి సిమెంట్స్) పెట్టుబడులుగా పెట్టారని సీబీఐ ఆరోపించింది. ఈ కేటాయింపుల్లో కీలక భూమిక పోషించిన మంత్రులు, ఐఏఎస్ అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఉపశమనం కోసం వాన్‌పిక్ యాజమాన్యం చేసిన ప్రయత్నాలకు కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మరోవైపు, ఈ కేసుతో ముడిపడి ఉన్న దాదాపు 11,000 ఎకరాల భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. దీనిపై కూడా న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది.






