- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: తీర్పుల పెండింగ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. తాజాగా ఆదేశాలు
తీర్పుల పెండింగ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రిజర్వ్ చేసి తీర్పుల ప్రకటనలో హైకోర్టులు చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి 31 కు ముందు రిజర్వ్ చేసిన తీర్పుల వివరాలు నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022లో జార్ఖండ్ హైకోర్టు తమ క్రిమినల్ అప్పీళ్లపై తీర్పు రిజర్వ్ చేసి ఇప్పటి వరకు ప్రకటించకపోవడంపై నలుగురు జీవిత ఖైదీలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై ఇవాళ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది.
67 కేసులు తీర్పులు పెండింగ్ లో:
జార్ఖండ్ హైకోర్టు నివేదికను పరిశీలించిన ధర్మాసనం 2022 నుంచి 2024 డిసెంబర్ వరకు డివిజన్ బెంచ్ విచారించిన 67 క్రిమినల్ కేసుల్లో తీర్పు రిజర్వ్ చేసి ప్రకటించలేదని హైకోర్టు ప్రకటించింది. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై కొన్ని మార్గదర్శకాలను చట్టబద్ధం చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఈ క్రమంలో తీర్పు రిజర్వ్ అయినా ఇంకా తీర్పు కోసం వెచి ఉన్న కేసులకు సంబంధించిన వివరాలును నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించింది. ఆ నివేదికలో క్రిమినల్, సివిల్ విషయలు విడిగా ఉండాలని స్పష్టం చేసింది.






