- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: బెంగాల్ టీచర్లకు స్వల్ప ఊరట
పశ్చిమబెంగాల్ (West Bengal) టీచర్ రిక్రూట్ మెంట స్కాం కేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో టీచర్లకు స్వల్ప ఊరట దక్కింది.

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమబెంగాల్ (West Bengal) టీచర్ రిక్రూట్ మెంట స్కాం కేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో టీచర్లకు స్వల్ప ఊరట దక్కింది. నియామక ప్రక్రియ ద్వారా ఎంపికై, ఎలాంటి ఆరోపణలు లేని, 9-12 తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లను కొనసాగించడానికి అనుమతించింది. కొత్త నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకు వారు టీచింగ్ చేయొచ్చని తెలిపింది. విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. అలాగే బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌కు ఒక డెడ్‌లైన్ విధించింది. మే 31లోగా కొత్త రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం ప్రకటన ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఎంపిక ప్రక్రియ డిసెంబర్ 31లోగా పూర్తికావాలని స్పష్టంచేసింది. దీనికి సంబంధించి మే 31లోగా రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ అఫిడవిట్ దాఖలు చేయాలని అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ స్వల్ప ఊరట గ్రూప్-సి, గ్రూప్-డి ఉద్యోగులకు వర్తించదు.
బెంగాల్ టీచర్ రిక్రూట్ మెంట్ స్కాం
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న 25,753 మంది టీచర్లు, ఇతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. వీరి నియామక ప్రక్రియ పూర్తిగా అక్రమాలతో నిండి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. టీచర్లు, ఇతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు గత సంవత్సరం ఏప్రిల్‌లో వెలువరించిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు, సిబ్బంది ఇప్పటివరకూ తాము పొందిన జీతభత్యాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇకపోతే, వివాదాస్పదంగా మారిన ఈ నియామకాలు 2016లోనే జరిగాయి. అయితే సుప్రీం ఆదేశాలతో పలు పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడింది. విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందని బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలోనే ఈ వివరాలు వెల్లడయ్యాయి.






