- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court : కోల్ కతా హత్యాచార కేసు పిటిషన్ విచారణ 29కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
కోల్ కతా హత్యాచార కేసు(Kolkata Massacre Case)పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు(Supreme Court)ఈనెల 29కి వాయిదా వేసింది. మెడికో హత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు సిల్ధా కోర్టు(Sildha Court)జీవిత ఖైదు(Life Imprisonment) విధించింది.

దిశ, వెబ్ డెస్క్ : కోల్ కతా హత్యాచార కేసు(Kolkata Massacre Case)పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు(Supreme Court)ఈనెల 29కి వాయిదా వేసింది. మెడికో హత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు సిల్ధా కోర్టు(Sildha Court)జీవిత ఖైదు(Life Imprisonment) విధించింది. సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు (Trainee Doctor's Parents) సుప్రీంకోర్టు(Petition Filed In Supreme Court)ను ఆశ్రయించారు. వారి పిటిషన్ ను ఈనెల 29న సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్(CJI Justice Sanjiv Khanna Bench) విచారణ చేయనుంది.
గతేడాది ఆగస్టు 9న ఆర్జీకర్ ఆస్పత్రి సెమినార్ గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన జరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో సిల్ధా కోర్టు నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చి జీవించినంత కాలం జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. నిందితుడికి రూ.50 వేల జరిమానా కూడా విధించింది. ట్రైనీ డాక్టర్ కుటుంబానికి రూ.17 లక్షలు చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పు పట్ల సంతృప్తి చెందని మృతురాలైన ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు నిందితుడు సంజయ్ రాయ్ కి ఉరి శిక్ష విధించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.






