"votechori" ఉద్యమానికి మద్దతు తెలపండి : ప్రజలకు రాహుల్ పిలుపు

by Muthe.Rajitha |

దేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని, దీనికి ఈసీ కూడా సహకరించిందని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసి బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే.

votechori ఉద్యమానికి మద్దతు తెలపండి : ప్రజలకు రాహుల్ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని, దీనికి ఈసీ కూడా సహకరించిందని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసి బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ వ్యాఖ్యలను ఎలక్షన్ కమిషన్ ఖండించినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దేశంలో ఎన్నికలు న్యాయంగా జరగాలంటే క్లీన్ ఓటరు లిస్ట్ అవసరమని అన్నారు. ఎన్నికల సంఘం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తూ డిజిటల్ ఓటర్ లిస్టు విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

మరోసారి దేశంలో ఓట్ల దొంగతనం జరగకుండా తమ "votechori" ఉద్యమానికి మద్దతు తెలపాలని రాహుల్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు గాను http://votechori.in/ecdemand వెబ్సైట్ ను సందర్శించి, లేదా 9650003420 నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి అయినా భారీగా ప్రజలు మద్దతు తెలపాలని రాహుల్ విజ్ఞప్తి చేసారు.

Next Story