విదేశాలకు వెళ్లాలనుకునేవారికి సూపర్ న్యూస్.. కేవలం రూ.1కే వీసా

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-02 09:10:57  IST  )

సాధారణంగా ట్రిప్స్ వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఒక్కసారైనా విదేశాల్లో విహరించాలని అనుకుంటుంటారు.

విదేశాలకు వెళ్లాలనుకునేవారికి సూపర్ న్యూస్.. కేవలం రూ.1కే వీసా
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ట్రిప్స్ వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఒక్కసారైనా విదేశాల్లో విహరించాలని అనుకుంటుంటారు. కానీ, ఆయా దేశాల వీసా ఖర్చులు వేలల్లో ఉంటాయి. దీంతో తమ కోరికను విరమించుకుంటారు. అయితే, విదేశీ ట్రిప్ ప్లాన్‌ చేసుకునే భారతీయులకు అట్లీస్ సంస్థ (Atlys Company) అదిరిపోయే ప్రకటించింది. జస్ట్ ఒక్క రూపాయికే (Rs 1 Visa Offer) వీసా ఇస్తామని వెల్లడించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 4, 5వ తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫాం అట్లీస్ 'వన్‌ వే అవుట్‌' పేరిట యూఏఈ, యూకే, వియత్నాం, ఇండోనేసియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, హాంకాంగ్‌, జార్జియా, ఒమన్‌, మొరాకో, ఖతర్‌, కెన్యా, తైవాన్‌ వంటి దేశాలకు వెళ్లానుకునేవారి కోసం రూపాయి ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇక విదేశాలకు ట్రిప్ ప్లాన్ చేసుకున్న వారు అట్లీస్‌ ద్వారా వీసా బుక్‌ చేసుకుంటే.. గ్రీస్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, ఇటలీ వంటి ఎంపిక చేసిన షెంజెన్‌ దేశాల విషయంలో సర్వీస్ ఛార్జ్, అపాయింట్‌మెంట్‌ ఫీజు రెండూ ఉండవు. అయితే, అయితే ప్రాసెసింగ్ కేంద్రం వద్ద మాత్రం కాన్సులేట్, బయోమెట్రిక్ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ఫ్రాన్స్‌కు వెళ్లాలనుకుంటే అపాయింట్‌మెంట్‌ ఫీజు రూ.2,047 ఉండొచ్చు. సర్వీస్‌ ఫీజ్‌ రూ.2,950గా ఉంటుంది. ఈ ఆఫర్ కింద ఆ మొత్తం ఏమీ లేకుండా కేవలం రూపాయి చెల్లిస్తే సరిపోతుంది. అలాగే, అమెరికాకు మామూలుగా సర్వీస్‌ ఫీజు రూ.19,940 వరకు ఉంటుందని, ఈ ఆఫర్ అందుబాటులో ఉన్న సమయంలో రూపాయి మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. కాగా, ఈ అట్లీస్‌ సంస్థ గతంలో కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటించి వార్తల్లో నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిస్తే వినియోగదారులకు ఉచితంగా వీసా అందిస్తామని ప్రకటించింది.

Next Story