- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్.. నేడే ప్రమాణ స్వీకారం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో తరవాత డిప్యూటీ సీఎం ఎవరు అన్నదానిపై ఉత్కంఠ నెలకొనగా దానికి తెరపడింది.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో తరవాత డిప్యూటీ సీఎం ఎవరు అన్నదానిపై ఉత్కంఠ నెలకొనగా దానికి తెరపడింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ స్థానంలో ఆయన సతీమణి సునేత్ర పవార్ పదివిని చేపట్టబోతున్నట్టు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకులు, మంత్రి ఛగన్ భుజ్ బాల్ తెలిపారు. సునేత్ర పవార్ పేరును శాసనసభా పక్ష నాయకురాలిగా, డిప్యూటీ సీఎం పదవిని ఖరారు చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు.
సీఎల్పీ ఎన్నిక తరవాత ప్రమాణస్వీకారం జరగవచ్చని అన్నారు. దీంతో ఈ రోజు సాయంత్రం 5గంటలకు సునేత్ర ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం సునేత్ర రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతుండగా ఆ పదివికి రాజీనామా చేయనున్నారు. అనంతరం ఆమెను సభ్యులు ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారు. తరవాత సునేత్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తరవాత ఆమెకు ఎక్సైజ్, క్రీడా శాఖలు కేటాయించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.






