- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో ఆత్మాహుతి దాడి ఎఫెక్ట్.. లాల్‌కిళా మెట్రో స్టేషన్ మూసివేత కొనసాగింపు
భారత దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పెలుడు.. యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు (Huge explosion).. యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసింది. పేలుడుపై దర్యాప్తు అనంతరం ఆత్మాహుతి దాడి (Suicide attack)గా నిర్ధారించిన పోలీసులు.. పూర్తి విచారణను NIA లాల్‌కిళా మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటించింది. భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. “లాల్‌కిళా మెట్రో స్టేషన్ (Lalkila Metro Station) భద్రతా కారణాల వల్ల తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మూసివేయబడుతుందని ఢిల్లీ మెట్రో (Delhi Metro) అధికారికంగా ప్రకటించింది.
అలాగే మిగతా అన్ని మెట్రో స్టేషన్లు సాధారణంగా పనిచేస్తాయని డీఎంఆర్‌సీ (DMRC) తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతాలో ట్వీట్ చేసింది. పెలుడు తర్వాత అప్రమత్తం అయిన అధికారులు లాల్‌కిళా పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న రద్ధీ ప్రాంతాలతో పాటు ఓ మార్కెట్ ను సైతం ముసివేశారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు, సెక్యూరిటీ బలగాలు అక్కడ పహారా కాస్తున్నాయి. అధికారులు ప్రజలను ఆ ప్రాంతానికి అవసరం లేనంతవరకు వెళ్లవద్దని సూచించారు.






