- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి...ఐదుగురు మృతి!
ఓ పెళ్లి వేడుక జరిగింది. ఈ సందర్భంగా అందరూ సంతోషంగా గడుపుతూ పెళ్లి పనుల్లో మునిగిపోయారు. ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ దేశంలో రోజుకో దారుణం జరుగుతోంది. ఏదో ఒక మూలన బాంబు బ్లాస్ట్ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఓ ఆత్మాహుతి దాడి జరగగా ఏకంగా 5 మంది అమాయకులు మరణించారు. ఈ సంఘటన పాకిస్తాన్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో తాజాగా ఓ పెళ్లి వేడుక జరిగింది. ఈ సందర్భంగా అందరూ సంతోషంగా గడుపుతూ పెళ్లి పనుల్లో మునిగిపోయారు. ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరిగింది. ఈ పెళ్లిలో ఆత్మహృతి దాడికి పాల్పడ్డారు. ప్రో గవర్నమెంట్ కమ్యూనిటీ లీడర్ అలాం మెహ్‌సూద్ ఇంట్లో జరిగిన ఈ దాడిలో ఏకంగా ఐదుగురు అమాయకులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
మరో 25 మందికి తీవ్ర గాయాలు కూడా జరిగాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇక ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద గ్రూప్ కూడా ప్రకటన చేయలేదు. అయితే తెహ్రిక్-ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఈ దాడి చేసి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






