Supreme Court: మాంసాహారులు కూడా జంతుప్రేమికులమని ప్రకటించుకుంటున్నారు:సొలిసిటర్‌ జనరల్‌

by Prasad Jukanti |

వీధి కుక్కుల బెడదపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: మాంసాహారులు కూడా జంతుప్రేమికులమని ప్రకటించుకుంటున్నారు:సొలిసిటర్‌ జనరల్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: వీధి కుక్కుల బెడదపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారులు జంతు సంతతి నియంత్రణ చర్యలు అమలు చేయకపోవడం వల్లే తీరు వల్లే ఈ సమస్య ఉత్పత్పన్నం అవుతున్నదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలో విధి కుక్కలన్నింటినీ తరలించాలని ఈ నెల 11న జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్.ఆర్ మహదేవన్ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించింది. జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్‌.వి.అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఆగస్టు 11న ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

వాళ్లు కూడా జంతు ప్రేమికులమని ప్రకటించుకుంటున్నారు:

అంతకు ముందు ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ జంతువులను ఎవరూ ద్వేషించరు. కానీ వీటి దాడుల్లో ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు కోల్పోతున్నారని కోర్టుకు వివరించారు. ఢిల్లీ వీధుల్లోని కుక్కలను తరలించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సమర్థించారు. కుక్కల తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య కంటే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. మాంసాహారం తినేవారు కూడా జంతుప్రేమికులమని ప్రకటించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా 37 లక్షల కుక్క కాటు కేసులు నమోదు అవుతున్నట్లలు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని రోజుకు దాదాపు 10 వేల కేసులు వందల సంఖ్యలో రేబిస్ మరణాలు చోటు నమోదు అవుతున్నాయని తెలిపారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిల్ వాదనలు వినిపిస్తూ వీధి కుక్కలను కనిపించకుండా వాటిని షెల్టర్లకు తరలించాలని ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. కుక్కలకు షెల్టర్లు లేవని వాటిని ఎక్కడికి తరలిస్తారు? షెల్టర్లు మున్సిపల్ కార్పొరేషన్ నిర్మిస్తుందా అనే ప్రశ్నలను లేవనెత్తారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

Next Story