‘‘నా కుమార్తె వల్లే రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధాని అయ్యారు’’

by Disha Web Desk 19 |
‘‘నా కుమార్తె వల్లే రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధాని అయ్యారు’’
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య, సమాజ సేవకురాలు సుధామూర్తి తన కుమార్తె అక్షితా మూర్తి, అల్లుడు రిషి సునాక్‌ల విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భర్త విజయంలో భార్య కీలక పాత్ర పోషిస్తుందని, తన కుమార్తె వల్లే రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధాని అయ్యారని సుధామూర్తి వ్యాఖ్యానించారు. ‘నేను నా భర్తను ఓ వ్యాపారవేత్తగా చేశాను.

నా కుమార్తె తన భర్తను బ్రిటన్ ప్రధానిని చేసింది. కారణం భార్య మహిమలే. భర్తను ఓ భార్య ఎలా మార్చగలదో చూడండి. నేను మాత్రం నా భర్తను మార్చలేకపోయాను. నేను నా భర్తను వ్యాపారవేత్తను చేస్తే, నా కుమార్తె మాత్రం తన భర్తను బ్రిటన్ ప్రధానిని చేసింది’ అని ఓ కార్యక్రమంలో సుధామూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అక్షతామూర్తిని ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 2009లో వివాహం చేసుకున్నారు.

Next Story

Most Viewed