- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గేమ్‌ఛేంజర్ ‘సుదర్శన చక్ర’..యూఎస్‌ను ధిక్కరించి రష్యాతో రూ.35 వేల కోట్లతో డీల్!
‘సుదర్శన చక్ర’ వ్యవస్థ పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టింది. యూఎస్‌ను ధిక్కరించి మరీ రష్యా నుంచి ఈ వ్యవస్థను భారత్ కొనుగోలు చేసింది.

దిశ, స్పోర్ట్స్: భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేసిన పాకిస్తాన్.. ఒకేసారి 15 నగరాల్లోని ఆర్మీ బేస్‌లపై దాడిచేసింది. ఈ దాడిని భారత్ తన ‘సుదర్శన చక్రం’తో తిప్పికొట్టింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 రక్షణ వ్యవస్థే ఈ ‘సుదర్శన చక్ర’. భారత రక్షణ వ్యవస్థలో ఇది ఒక గేమ్ ఛేంజర్. 15 నగరాలపై జరగిన దాడులను తిప్పికొట్టిందంటే.. ఈ వ్యవస్థ ఎంత శక్తిమంతమైనదో అర్థం చేసుకోవచ్చు. 400 కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్ల నుంచి 40 కిలోమీటర్ల దగ్గరలోకి వచ్చేసిన టార్గెట్లను కూడా ‘సుదర్శన చక్ర’ బూడిద చెయ్యగలదు.
ట్రైలర్‌తోనే మెప్పించింది..
గతేడాది ఈ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ.. భారత వాయుసేనలో చేరింది. ఈ సందర్భంగా చేపట్టిన వాయసేన విన్యాసాల్లో 80 శాతం టార్గెట్లను ‘సుదర్శన చక్ర’ ధ్వంసం చేసింది. మిగతా 20 శాతం టార్గెట్లను వెనక్కు తిరిగి పారిపోయేలా చేసింది. ఈ ఎక్సర్‌సైజు తర్వాతనే ఎయిర్ ఫోర్సులోకి ‘సుదర్శన చక్ర’ను ప్రవేశపెట్టారు.
యూఎస్‌ను కాదని 35 వేల కోట్ల డీల్..
‘సుదర్శన చక్ర’ అసలు పేరు ఎస్-400 ట్రయంఫ్. రష్యాలో తయారు చేసిన ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని 2018లోనే భారత్ నిర్ణయించుకుంది. దీనికోసం రూ.35 వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇది అమెరికాకు నచ్చలేదు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత.. ఈ ఒప్పందం రద్దు చేసుకోవాలని భారత్‌పై తెగ ఒత్తిడి చేసింది యూఎస్. లేదంటే ఆంక్షలు విధిస్తామని బెదిరించింది. అయినా సరే భారత్ తలొగ్గలేదు.
ఇంకా కంప్లీట్ కాలేదు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎస్-400 రక్షణ వ్యవస్థ మనకు ఇంకా పూర్తిస్థాయిలో దక్కలేదనే చెప్పాలి. మొత్తం ఐదు స్క్వాడ్రన్‌ల కోసం భారత్-రష్యా మధ్య ఒప్పందం జరిగింది. కానీ ఇప్పటి వరకు కేవలం 3 స్క్వాడ్రన్‌లు మాత్రమే భారత్‌కు వచ్చాయి. వచ్చే ఏడాది ఆగస్టులోగా మిగిలిన రెండు స్క్వాడ్రన్‌లను అందజేస్తామని రష్యా హామీ ఇచ్చింది. వీటిని వాయుసేనకు అందజేసే సమయంలోనే విష్ణుమూర్తి చేతిలో ఉండే ‘సుదర్శన చక్రం’ పేరు మీదుగా ‘సుదర్శన చక్ర’ అనే పేరు పెట్టడం జరిగింది.






