నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌ ‘ఆస్థా పూనియా’

by Phanindra |

నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌ ‘ఆస్థా పూనియా’ నియమితులయ్యారు. విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో ఆమె శిక్షణ పూర్తిచేసుకున్నారు.

నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌ ‘ఆస్థా పూనియా’
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత నేవీలో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా నియమితులయ్యారు. విశాఖపట్టణంలోని ఐఎన్ఎస్ డేగాలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పూనియాకు ప్రతిష్టాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ (బంగారు రెక్కలు) అందజేశారు. అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (ఎయిర్) రియర్ అడ్మిరల్ జానక్ బెవిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పూనియాతోపాటు లెఫ్టినెంట్ అతుల్ కుమార్ ధుల్‌ కూడా సెకండ్ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్సు పూర్తి చేసి నేవీలో ఫైటర్ పైలట్‌గా చేరారు. ‘నేవల్ ఏవియేషన్‌లో ఇదొక కొత్త శకానికి నాంది’ అని భారత నేవీ పేర్కొంది.

Next Story