Breaking: యూనివర్సిటీలో కాల్పులు.. విద్యార్థి మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-01 17:12:26  IST  )

యూపీ అలీగఢ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పులు(Firing) కలకలం రేగింది...

Breaking: యూనివర్సిటీలో కాల్పులు.. విద్యార్థి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: యూపీ అలీగఢ్ యూనివర్సిటీ(Aligarh Muslim University)క్యాంపస్‌లో కాల్పులు(Firing) కలకలం రేగింది. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఘర్షణలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో విద్యార్థి మృతి(Student Died) చెందారు. ఏబీకే యూనియన్ స్కూల్(ABK Union School) గేటు వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మహ్మద్ కైఫ్‌(Mohammed Kaif)గా గుర్తించారు. మహ్మద్ స్థానిక అలీనగర్ కాలనీలో ఉంటూ కామర్స్ చదువుతున్నారు. యూనివర్సిటీలో జరిగిన కాల్పులో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కైఫ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ టీవీ ఫుటేజులను పరిశీలించారు.

మరోవైపు మహ్మద్ కైఫ్ బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన కుమారికి కాలేజీలో ఎవరితోనూ ఘర్షణలు లేవని కైఫ్ తండ్రి నయీం తెలిపారు. మహ్మద్ కైఫ్ 11వ తరగతి చదువుతున్నాడని, ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని నయీం డిమాండ్ చేశారు.

Next Story