Stray Dogs: వామ్మో.. యువకుడిపై 7 వీధి కుక్కలు దాడి.. బైక్ తోసినా వదల్లేదు.. ఎలా తప్పించుకున్నాడంటే?

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవ్వరినీ కూడా వీధి కుక్కలు వదిలిపెట్టడం లేదు.

Stray Dogs: వామ్మో.. యువకుడిపై 7 వీధి కుక్కలు దాడి.. బైక్ తోసినా వదల్లేదు.. ఎలా తప్పించుకున్నాడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొంతకాలంగా (Stray Dogs) వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధుల్లో వెళ్లే వారిపై తీవ్రంగా దాడి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవ్వరినీ కూడా వీధి కుక్కలు వదిలిపెట్టడం లేదు. తాజాగా (Maharashtra) మహారాష్ట్రలో 7 వీధి కుక్కలు ఓ యువకుడిపై దాడి చేసిన ఘటన.. కుక్కల బెడదపై ఆందోళనను కల్గిస్తోంది. పూణేకి సమీపంలోని (Pimpri Chinchwad) పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో ఇవాళ (శనివారం) తెల్లవారుజామున ఓ యువకుడు ఏడు వీధి కుక్కల నుంచి పోరాటం చేసి తప్పించుకున్నాడు. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ప్రకారం.. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎవరూ లేని వీధిలో ఓ యువకుడు ఫోన్ చూసుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఏడు వీధి కుక్కలు అతనిపై దాడికి దిగాయి. అతన్ని కరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. వెంటనే ఆ యువకుడు సమీపంలోని బైక్ వెనక నిలబడ్డాడు. అయిన కూడా కుక్కలు అతనిపై దాడికి దిగాయి. దీంతో అతను వాటిపై బైక్‌ను తోసేస్తాడు. కానీ కుక్కలకు ఏమీ కాదు.

కొద్ది సేపటి వరకు చేతికి అందిన వాటితో వాటిని తరిమే ప్రయత్నం చేస్తాడు. కుక్కల అరుపులు విన్న స్థానికులు తమ ఇళ్ల నుంచి బయటకు రావడంతో కుక్కలు పారిపోతాయి. దీంతో అతను వాటి భారీ నుంచి తప్పించుకుంటాడు. ఈ ఘటనలో యువకుడు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్ ‌ఆఫీస్‌లో వీధి కుక్కల బెడదను నియంత్రించాలని కంప్లైట్ ఇచ్చినట్లు సమాచారం. కాగా, వీధి కుక్కల దాడులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాడుల నేపథ్యంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వీధి కుక్కలను డాగ్ షెల్టర్‌లకు తరలించాలని అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను (Dog Lovers) జంతు ప్రేమికులు వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మరికొంత మంది ప్రజలు మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలను సపోర్ట్ చేశారు.

Next Story