దారుణం.. డబ్బులు కట్టలేదని భార్యను లాక్కెళ్లిన బ్యాంక్ అధికారులు.. బ్రాంచ్‌లోనే లాక్ చేసి.. నరకం..

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-30 12:43:14  IST  )

ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో దారుణం చోటు చేసుకుంది. పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి వాయిదాలు చెల్లించడం లేదని.. భార్యను పట్టుకెళ్లారు బ్యాంక్ అధికారులు. ఐదుగంటల పాటు బ్రాంచ్‌లోనే బందీగా ఉంచారు. ఆ తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వదిలిపెట్టారు. రవీంద్ర వర్మ నలభై వేల పర్సనల్

దారుణం.. డబ్బులు కట్టలేదని భార్యను లాక్కెళ్లిన బ్యాంక్ అధికారులు.. బ్రాంచ్‌లోనే లాక్ చేసి.. నరకం..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో దారుణం చోటు చేసుకుంది. పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి వాయిదాలు చెల్లించడం లేదని.. భార్యను పట్టుకెళ్లారు బ్యాంక్ అధికారులు. ఐదుగంటల పాటు బ్రాంచ్‌లోనే బందీగా ఉంచారు. ఆ తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వదిలిపెట్టారు. రవీంద్ర వర్మ నలభై వేల పర్సనల్ లోన్ తీసుకున్నాడు. నెలకు రూ. 2,120 కట్టాల్సి ఉంది. ఇప్పటికే 11 వాయిదాలు చెల్లించారు. కానీ బ్యాంకు కేవలం ఏడు వాయిదాలు మాత్రమే చెల్లించారని చెప్తుంది. ఏజెంట్లు కౌశల్, ధర్మేంద్రలు చెల్లింపులను దుర్వినియోగం చేయొచ్చని.. దీంతో ఖాతా నాన్-పెర్ఫార్మింగ్ యాసెట్ (NPA)గా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో బ్యాంకు సిబ్బంది పూజాను వాయిదా చెల్లించే వరకు బ్యాంకు బ్రాంచ్‌లో బందీగా ఉంచారని చెప్తున్నారు. రవీంద్ర 112కు ఫోన్ చేయడంతో పోలీసు రెస్పాన్స్ వెహికల్ (PRV) బృందం బ్యాంక్ అధికారులతో మాట్లాడి.. పూజాను విడిపించింది.

దీంతో బాధితురాలు పూజా.. బ్యాంక్‌పై పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. బందీగా ఉంచడం, ఏజెంట్ల అవినీతి గురించి ఫిర్యాదులో పేర్కొంది. మరో వైపు బ్రాంచ్ అధికారి.. ఈ ఆరోపణలను ఖండించాడు. కేవలం మాట్లాడేందుకు మాత్రమే పూజను పిలిచామని చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా.. బ్యాంక్ అధికారులు గుండాల్లా మారారని చెప్తున్నారు. కిడ్నాప్ కేసు పెట్టాలని సూచిస్తున్నారు.

Next Story