- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
NRIs : అందువల్లే ఇండియాకు నో రిటర్న్.. విదేశాల్లో సెటిల్ కావడంపై ఎన్ఆర్ఐల వింత సమాధానాలు
దిశ, డైనమిక్ బ్యూరో: 'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి' అని ఓ సినీ రచయిత రాసినట్లుగా అనేక మంది పుట్టిన నేలను, ఇక్కడ అయిన వారిని విడిచి దూరంగా ఉండలేక పోతుంటే మరో పక్క భారతీయులు అనేక మంది విదేశాల్లో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అక్కడే స్థిరపడాలనుకునే వారికి యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలు స్వర్గదామంగా మారాయి. అయితే చదువు కోసమో ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి రాకపోవడంపై ఓ వ్యక్తి చేసిన పోస్టుకు ఎన్ఆర్ఐలు ఇచ్చిన వింత సమాధానాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఇటీవల యూకేలో నివసిస్తున్న ఒక రెడ్డిట్ యూజర్ భారతదేశానికి తిరిగి రాకపోవడానికి గల కారణాలేంటో చెప్పండంటూ తన తోటి ఎన్ఆర్ఐలను సామాజిక మాద్యమం వేదికగా అడిగాడు. నేను ఇక్కడ అధిక పన్నులు చెల్లిస్తాను. కానీ మంచి మౌలిక సదుపాయాలు, లైబ్రరీలు, చక్కగా నిర్వహించబడుతున్న పరిసరాలు, ఆరోగ్యం, విద్య వంటి మంచి ప్రజా సేవలను పొందుతాను. అలాగే మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. తీర్పు లేని సమాజం, చాలా వరకు ప్రజలు నిజమైనవారు ఉంటారు. ముఖ్యంగా నేను నివసించే ప్రాంతంలో చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉంటుంది. ఈ కారణాలు నన్ను ఇక్కడే ఉండేలా చేస్తుంటే.. సౌకర్యాలు, ఇంటి సహాయం, కుటుంబం, పండుగలు, చౌకైన జీవన వ్యయం వంటివి భారత దేశాన్ని మిస్ అవుతున్నామనే ఆందోళన కలిగిస్తాయి. మరి భారతదేశానికి తిరిగి రాకుండా మిమ్మల్ని ఆపేది ఏమిటి? అని సదరు యూజర్ ప్రశ్నించాడు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ భిన్నమైన సమాధానాలు ఇచ్చారు. నేను విదేశాలలో ఉండటానికి ఏకైక ప్రేరణ ఆర్థిక లాభం అని ఓ యూజర్ అంగీకరించారు. మరొ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. తాము ఉంటున్న విదేశంలోని మౌళిక సదుపాయాల గురించి చెబుతూ భారతదేశంలో సరిపోని ప్రజా రవాణా, పేలవమైన రహదారుల పరిస్థితి వంటి సమస్యలను ఎత్తి చూపారు. మరికొందరు భారతీయులలో పౌర భావం లేకపోవడాన్ని ఓ సాకుగా చూపగా మరో వినియోగదారు స్పందిస్తూ స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారంతో పాటు ఇక్కడ అవినీతి తక్కువ. మనం పన్నులు చెల్లిస్తున్నప్పటికీ అది మన జీవితాలకు మేలు చేస్తోంది. సివిక్ సెన్స్ ఉన్న జనాభా. పనిచేస్తున్న ప్రభుత్వం. మెరుగైన పని సంస్కృతి. ఉన్నత జీవన ప్రమాణాలు. మనుషులు ఇతరుల జీవితంలో జోక్యం చేసుకోరు అంటూ రాసుకొచ్చారు. మరి కొంత మంది భారత దేశానికి తిరిగి రావాలనే కోరికను వ్యక్తం చేస్తూ సాంస్కృతిక సంబంధాలు, కుటుంబ సంబంధాలు మరియు చెందిన భావాన్ని ఉదహరించారు. మరికొందరు తమ అంతర్జాతీయ అనుభవం మరియు నైపుణ్యాన్ని ఉపయోగించుకుని భారతదేశ వృద్ధి మరియు అభివృద్ధికి దోహదపడే ప్రణాళికలను పంచుకున్నారు. ఇదిలా ఉంటే ప్రతియేటా పౌరసత్వం వదులుకుంటున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ మేరకు 2023లో 2.16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని గతంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు వెల్లడించింది.