- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేగంగా వెళ్తున్న రైలుపై రాళ్ల దాడి.. ప్రయాణికుడికి తీవ్ర గాయాలు
నడుస్తున్న రైలు పై అపరిచిత వ్యక్తి రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడి ముక్కుకి తీవ్ర గాయమైంది. బీహార్ లోని భాగల్‌పూర్-జైనగర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. రాయి విసిరిన వ్యక్తిని ఎవరో రైల్లోంచి వీడియో, ఫోటోలు తీశారు.

దిశ, వెబ్ డెస్క్: నడుస్తున్న రైలు పై అపరిచిత వ్యక్తి రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడి ముక్కుకి తీవ్ర గాయమైంది. బీహార్ లోని భాగల్‌పూర్-జైనగర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. రాయి విసిరిన వ్యక్తిని ఎవరో రైల్లోంచి వీడియో, ఫోటోలు తీశారు. ప్రస్తుతం అతని ఫోటో, దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాళ్ళ దాడి కారణంగా రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ముక్కుకు తీవ్ర గాయమై, రక్తం కారుతున్నట్లు వీడియోను చూస్తే అర్ధమవుతుంది.
అయితే.. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటోలో.. రైలు కదులుతున్నప్పుడు సమీపంలోని ఒక యువకుడు రైలుపై రాళ్లు రువ్వడం కనిపించింది. మరొక ఫోటోలో ముక్కుకు గాయంతో రైలు లోపల సీటుపై కూర్చున్న ప్రయాణికుని చూపిస్తుంది. వీడియో క్లిప్‌తో పాటుగా ఉన్న ఒక నోట్‌లో దర్బంగా - కాకర్‌ఘాటి మధ్య రాళ్లదాడి జరిగిందని, రాయిని విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.






