కర్ణాటకలో గణేష్ నిమజ్జనాలపై రాళ్లదాడి.. నిరసన వ్యక్తం చేసిన హిందూ సంఘాల పై లాఠీ ఛార్జ్

by Malleboina Mahesh |

కర్ణాటకలో వినాయక విగ్రహాలపై రాళ్ల దాడిని నిరసిస్తూ నిరసిస్తూ ఈ రోజు హిందూ సంఘాలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

కర్ణాటకలో గణేష్ నిమజ్జనాలపై రాళ్లదాడి.. నిరసన వ్యక్తం చేసిన హిందూ సంఘాల పై లాఠీ ఛార్జ్
X

దిశ, వెబ్ డెస్క్: గడిచిన రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక నగరాలు పట్టణాల్లో వినాయక నిమజ్జనాలు (Ganesha immersions) వైభవంగా ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తయ్యాయి. కానీ కర్ణాటకలోని మాండ్య లోని మద్దూర్ పట్టణంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు వినాయక నిమజ్జనాలను పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. మద్దూర్ పట్టణంలో జరిగిన గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఓ ప్రార్థన మందిరం నుంచి దుండగులు రాళ్ల దాడి (Stone attack) చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. వినాయక విగ్రహాలపై రాళ్ల దాడిని నిరసిస్తూ నిరసిస్తూ ఈ రోజు హిందూ సంఘాలు (Hindu communities) స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

అయితే ముందస్తుగానే కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికి ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా హిందూ సంఘాల పై లాఠీ ఛార్జ్ (baton charge) చేశారు. దీంతో పోలీసులు తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినాయక విగ్రహాలపై రాళ్లు విసిరిన వారిని కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సామాన్య ప్రజలపై మాత్రం లాఠీ ఝులిపిస్తున్నారని మండిపడుతున్నారు.

Next Story