- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోకర్ణ గుహలోని రష్యన్ మహిళ బహిష్కరణపై స్టే.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కర్ణాటక రాష్ట్రం, గోకర్ణ (Gokarna) సమీపంలోని రామతీర్థ కొండ వద్ద గుహలో రహస్య జీవనం సాగిస్తున్న నైనా కుటినా (40) అనే రష్యన్ మహిళను స్థానిక పోలీసులు రక్షించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్రం, గోకర్ణ (Gokarna) సమీపంలోని రామతీర్థ కొండ వద్ద గుహలో రహస్య జీవనం సాగిస్తున్న నైనా కుటినా (40) అనే రష్యన్ మహిళను స్థానిక పోలీసులు రక్షించిన సంగతి తెలిసిందే. కేవలం ఇద్దరు కుమార్తెలతో కలిసి దాదాపు రెండు వారాల పాటు అక్కడే ఉంటున్న విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అయితే, ఎనిమిదేళ్ల క్రితం ఇండియా వీసా తీసుకుని దేశంలోకి ఎంటరైన కుటినా.. వీసా గడువు ముగిసింది. దీంతో పోలీసులు ఆమెను గుహ నుంచి తుమకూరు (Thumakuru) జిల్లాలోని షెల్టర్ హోమ్‌కు తరలించారు. అయితే, తాజాగా కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) ఆదేశాల మేరకు నీనా కుటినా బహిష్కరణపై కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎస్.సునీల్ దత్ యాదవ్ (S.Sunil Dutt Yadav) సింగిల్ బెంచ్ స్టే విధించింది.
ఈ క్రమంలోనే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నినా కుటినాను భారత్ నుంచి బలవంతంగా బహిష్కరించడం వల్ల ఆమె కుమార్తెల భద్రత, సంక్షేమానికి విఘాతం కలుగుతుందని అన్నారు. యూఎన్‌సీఆర్సీ ఆర్టికల్-3 (UNCRC Article-3) ప్రకారం.. పిల్లలను ప్రభావితం చేసే అన్ని నిర్ణయాలు, చర్యలలో పిల్లల ఉత్తమ ప్రయోజనాలను ముఖ్యమైనదిగా పరిగణించాలని, వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ బహిష్కరణ ఉత్తర్వులను పున: సమీక్షించాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. అయితే, ప్రస్తుతం పిల్లల వద్ద సరైన ప్రయాణ లేదా గుర్తింపు పత్రాలు లేవని యూనియన్ ఆఫ్ ఇండియా తరఫున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) కోర్టుకు తెలిపారు. ఈ వాదన ఆధారంగా తక్షణ బహిష్కరణ ఇలాంటి దశలో సమర్థనీయం కాదని ధర్మాసనం పేర్కొంది.






