- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: రాష్ట్రాల వైఫల్యంతో ఔషధాల ధరలు ప్రియం- సుప్రీంకోర్టు
రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటు ధరలో వైద్య సంరక్షణ, మౌలిక సదుపాయాలను నిర్ధారించడంలో విఫలమయ్యాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటు ధరలో వైద్య సంరక్షణ, మౌలిక సదుపాయాలను నిర్ధారించడంలో విఫలమయ్యాయని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతోనే ఔషధాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని విమర్శించింది. సమాజంలో పేద వర్గాలకు అత్యవసర మెడిసిన్ సహేతుకర ధరలకు మందులు అందించడంలో విఫరలమయ్యాని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేటు ఆస్పత్రుకు ప్రోత్సాహకంగా మారిందని వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను, వారి బంధువులను బలవంతం చేసి అధికధరలకు మందులు కొనుగోలు చేస్తున్నాయని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రోగులను ఆస్పత్రి ఫార్మసీల నుండి మాత్రమే మందులు కొనుగోలు చేసేలా బలవంత పెట్టొద్దని ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాలు నియంత్రణతో పాటు దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని.. దీని ఫలితంగా రోగులు దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు.
వైద్య సంరక్షణ రాష్ట్రాల విధి
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కె. సింగ్‌లతో కూడిన ధర్మాసనం.. వైద్య సంరక్షణ కల్పించడం రాష్ట్రాల విధి అని పేర్కొంది. అయితే, కొన్ని రాష్ట్రాలు అవసరమైన వైద్య సంరక్షణను అందించలేకపోయాయని, అందువల్లే "ప్రైవేట్ సంస్థలకు సౌకర్యాలు కల్పించి ప్రోత్సహించాయని" వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి సంస్థలను నియంత్రించాలని సూచించింది. ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్య సంస్థలు పౌరులను దోపిడీ చేయకుండా రక్షణ కల్పించడానికి మార్గదర్శకాలను రూపొందించాలని మార్గదర్శకాలు జారీ చేయడం మంచిది కాదని కోర్టు అభిప్రాయపడింది. కానీ, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడం అవసరమని నొక్కి చెప్పింది. ఇకపోతే, ఈ అంశంపై సుప్రీంకోర్టు గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌తో సహా అనేక రాష్ట్రాలు కౌంటర్-అఫిడవిట్‌లు దాఖలు చేశాయి. ఔషధ ధరల అంశంపై రాష్ట్రాలు కేంద్రం జారీ చేసిన ధరల నియంత్రణ ఉత్తర్వులపై ఆధారపడుతున్నాయని వెల్లడించింది.






