Starmer: అక్రమ వలసదారులపై కఠిన చర్యలు.. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ వార్నింగ్

by B.Srinivas |

అక్రమ వలసదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చట్ట విరుద్ధంగా ప్రవేశిస్తే నిర్బంధం తప్పదని బ్రిటన్ ప్రధాని హెచ్చరించారు.

Starmer: అక్రమ వలసదారులపై కఠిన చర్యలు.. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అక్రమ వలసదారులపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, దేశంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశిస్తే నిర్బంధం తప్పదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Kier starmer) హెచ్చరించారు. అక్రమంగా దేశంలోకి ఎంటరైన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని బహిష్కరిస్తామన్నారు. అంతేగాక ఇక్కడ నేరాలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘వలస దారులు ఈ దేశానికి చట్టవిరుద్ధంగా వస్తే, వారిని అదుపులోకి తీసుకుని తిరిగి స్వదేశానికి పంపిస్తాం. బ్రిటన్‌కు వచ్చి నేరం చేస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బహిష్కరిస్తాం’ అని పేర్కొన్నారు. విదేశీయులు చాలా కాలంగా బ్రిటన్ వలస వ్యవస్థను ఆసరాగా చేసుకుంటున్నారని, కోర్టుల్లో వారి అప్పీల్లు ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఏళ్ల తరబడి బ్రిటన్ లోనే ఉంటుందన్నారని తెలిపారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం ముగిసి పోతుందని, బ్రిటన్‌లో విదేశీ పౌరులు చట్టాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

Next Story