- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమ్యూనిస్టు పార్టీ మహాసభలకు స్టార్ హీరో అండ్ స్టార్ డైరెక్టర్.. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు(CPIM) పార్టీ 24వ జాతీయ మహా సభలు తమిళనాడులోని మదురై వేదికగా జరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు(CPIM) పార్టీ 24వ జాతీయ మహా సభలు తమిళనాడులోని మదురై వేదికగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభమైన ఈ సభలు.. 6వ తేదీన ముగుస్తాయి. ఈ నేపథ్యంలో 6వ తేదీన భారీ బహిరంగ సభ, ప్రదర్శనకు కూడా ఎర్రజెండా నేతలు సిద్ధమయ్యారు. ఈ సమావేశాల్లోనే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని కూడా ఎన్నుకోబోతున్నారు. సీతారాం ఏచూరి మృతిచెందడంతో ఇప్పుడా పదవి ఖాళీగా ఉన్నది.
మరోవైపు ఈ సమావేశాల్లో భాగంగా కల్చరర్ ప్రోగ్రామ్స్(Cultural Programs) కూడా ప్లాన్ చేశారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు మధురైలోని తముక్కం మైదానంలో డాన్స్, సింగింగ్‌తో పాటు అనేక రకాల కల్చరర్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi), దర్శకుడు/నటుడు సముద్రఖని(Samuthirakani), మరో దర్శకుడు వెట్రిమారన్(Vetrimaaran) పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని కమ్యూనిస్టు పార్టీ నేతలు సోషల్ మీడియా అధికారిక ఖాతా ద్వారా తెలియజేశారు.
ఇండస్ట్రీకి చెందిన హీరోలు, దర్శకులే కాకుండా .. ఈ సభలకు వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటుండంతో మధురై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా సీసీ టీవీ ఫుటేజీల ద్వారా ఈవెంట్‌ను పరిశీలిస్తున్నారు.






