- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీనగర్‌లో రికార్డు స్థాయి చలి.. మైనస్ 2.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
జమ్మూ కశ్మిర్ లోని శ్రీనగర్‌లో ఈ ఏడాది ఉహించినదానికంటే ముందూ శీతాకాలం ప్రారంభమైంది. గతంలో చలి ప్రభావం నెమ్మదిగా పెరిగేది.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మిర్ లోని శ్రీనగర్‌లో ఈ ఏడాది ఉహించినదానికంటే ముందూ శీతాకాలం ప్రారంభమైంది. గతంలో చలి ప్రభావం నెమ్మదిగా పెరిగేది. కానీ ఈ సారి అలా కాకుండా.. చలి ప్రభావం మరింత తీవ్ర మవుతూ.. ఈ రోజు ఉదయాన్నే నగరంలో కనిష్ఠంగా మైనస్ 2.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కశ్మీర్ లోయలోని ఎగువ ప్రాంతాల్లో తాజాగా కురిసిన మంచు (fresh snowfall) ఈ చలి తీవ్రతను మరింత పెంచింది. అయినప్పటికీ, రాత్రిపూట ఆకాశాన్ని కమ్మేసిన మేఘాలు (overnight cloud cover) కొంత ఉపశమనాన్ని కలిగించాయి. ఈ మేఘాల కారణంగా ఆ ప్రాంతం అంతటా కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు రెండు డిగ్రీల వరకు పెరిగాయి.
శీతాకాలం ముందుగానే, తీవ్రంగా రావడంతో అక్కడి ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానికులు తీవ్రమైన చలి కారణంగా బయట తిరగడానికి కష్టపడుతున్నారు. ఈ అకాల చలి పరిస్థితులు సాధారణ జీవనశైలికి సవాళ్లను పెంచాయి. ఈ సంవత్సరం శీతాకాలం అకాలంగా రావడంతో, ప్రజలు రాబోయే దీర్ఘకాలిక చలిని ఎదుర్కోవడానికి తమ దినచర్యలను ముందస్తుగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఏడాది చలికాలం ముందుగానే ప్రారంభం కావడంతో పర్యాటకుల తాకిడి కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్ల కనెక్టివిటీ దెబ్బతినడంతో బైక్ రైడర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం.






