Sri Lanka: మోడీ పర్యటనతో దిగొచ్చిన శ్రీలంక ప్రభుత్వం

by Shamantha N |

ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) శ్రీలంక పర్యనటలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకేతోతో జాలర్ల అంశం గురించి ప్రస్తావించారు.

Sri Lanka: మోడీ పర్యటనతో దిగొచ్చిన శ్రీలంక ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) శ్రీలంక పర్యనటలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకేతోతో జాలర్ల అంశం గురించి ప్రస్తావించారు. ఈ వివాదాన్ని మానవతా దృక్పథంలో పరిష్కారం చూపలని మోడీ అభ్యర్థించారు. కాగా..దీనిపై వెంటనే స్పందించిన శ్రీలంక ప్రభుత్వం 11 మంది జాలర్లను విడుదల చేసింది. కాగా.. మత్స్యకారుల విషయంలో భారత్‌, శ్రీలంకల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. తమ జలాల్లో వేట సాగిస్తున్నారంటూ భారత జాలర్లను కొలంబో నౌకాదళ సిబ్బంది అదుపులోకి తీసుకుంటున్నారు. శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ అధ్యక్షుడు కుమార దిసనాయకేతో మత్య్సకారుల అంశంపై ప్రస్తావించారు. శ్రీలంక నిర్బంధంలో ఉన్న భారత మత్స్యకారుల్ని, వారి పడవల్ని వెంటనే విడుదల చేయాలని మోడీ కోరారు. దీంతో, మానవతా దృక్పథంతో శ్రీలంక ప్రభుత్వం 11 మంది జాలర్లను విడుదల చేసింది.

జయశ్రీ మహాబోధి సందర్శన

ఇకపోతే, శ్రీలంక పర్యటనలో భాగంగా మోడీ.. దిశనాయకేతో కలిసి అనురాధపురలోని జయశ్రీ మహా బోధిని సందర్శించారు. మహో- ఒమన్‌తాయ్‌ల మధ్య అప్‌గ్రేడ్‌ చేసిన రైల్వేలైన్‌ కలిసి ప్రారంభించారు. ఆతర్వాత భారత్ కు పయనమయ్యారు. తిరుగు ప్రయాణంలో మోడీ రామసేతుని సందర్శఇంచిన ఫొటోను సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. ‘‘శ్రీలంక నుంచి తిరిగి వస్తుండగా.. రామసేతును దర్శించే భాగ్యం కలిగింది. అయోధ్యలో బాలరాముడికి సూర్య తిలకం సమయంలోనే ఇది జరగడం విశేషం. ఈ రెండింటిని చూసిన అదృష్టం నాకు దక్కింది’’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా, తన పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Next Story