గూఢచర్యం నెట్‌వర్క్ భగ్నం..ఇద్దరు అరెస్ట్

by Malleboina Mahesh |

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ గూఢచర్యం నెట్‌వర్క్ పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.

గూఢచర్యం నెట్‌వర్క్ భగ్నం..ఇద్దరు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్.. శత్రుదేశాల గూఢచర్యం నెట్‌వర్క్ (Spy network) పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో నెట్ వర్క్‌లను చేధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) తాజాగా గుజరాత్‌‌లో మరో గూఢచర్యం నెట్‌వర్క్ ను భగ్నం చేసింది. అహ్మదాబాద్‌ (Ahmedabad) లో ఒక మహిళతో సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు గుజరాత్ ఏటీఎస్ వెల్లడించింది. అరెస్ట్ అయిన వారిలో ఒక పురుష నిందితుడు, ఎ.కె. సింగ్, గోవాలో నివసిస్తున్నాడు. అతను భారత సైన్యం (Indian Army) లో సుబేదార్ హోదాలో ఉన్నాడు. మరొక మహిళా నిందితురాలు, రష్మణి పాల్, డామన్‌లో నివసిస్తోంది. ఈ ఇద్దరూ పాకిస్తాన్‌తో సంప్రదింపులు జరుపుతూ, దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని (Classified Information) వారికి చేరవేసినట్లు ఏటీఎస్ తెలిపింది. దేశ భద్రత (national security)కు సంబంధించిన ఈ కీలక కేసుపై ఏటీఎస్ మరింత దర్యాప్తు కొనసాగిస్తోంది.

Next Story