- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరాలు.. 2 వేల మంది ఉద్యోగుల ఆందోళన
ఇటీవలి కాలంలో మహిళలను చిత్రీకరించడానికి రహస్య కెమెరాలు అమర్చుతున్న ఘటనలు విపరీతంగా పెరుగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవలి కాలంలో మహిళలను చిత్రీకరించడానికి రహస్య కెమెరాలు అమర్చుతున్న ఘటనలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంతకాలం స్పై కెమరాలు మాల్స్ లోని ట్రయల్స్ రూమ్స్ కే పరిమితం కాగా... ఇపుడు స్కూల్స్, కాలేజేస్, ఆఫీసులు, హాస్టల్స్ లో రహస్య కెమెరాలు బాగోతాలు బట్టబయలు కావడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా తళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న మహిళల వసతి గృహం టాయిలెట్‌లో స్పై కెమెరాలు అమర్చిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒడిషాకు చెందిన మహిళా ఉద్యోగి నీలకుమారి గుప్తా రహస్యంగా వీడియోలు చిత్రీకరించి తన బాయ్‌ఫ్రెండ్‌కు షేర్ చేసినట్లు ఆమె కదలికలపై అనుమానం వచ్చిన మరో మహిళ నిర్వాహకులకు తెలియజేయడంతో కెమెరాలు బయటపడ్డాయి.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుమారు 2,000 మంది మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.






