వీక్షకుడు కాస్త బాధితుడిగా.. ప్రియురాలితో ఏకాంతంగా గడిపిన వీడియో పోర్న్ సైట్‍లో

by Prasad Jukanti |   (  Updated:2026-02-07 09:04:58  IST  )

ఓ వ్యక్తి హోటల్ గదిలో తన గర్ల్ ఫ్రెండ్ తో ఏకాతంగా గడిపిన వీడియో అడల్ట్ కంటెంట్ వెబ్ సైట్ లో ప్రత్యక్షకం కావడం కలకలం రేపింది.

వీక్షకుడు కాస్త బాధితుడిగా..  ప్రియురాలితో ఏకాంతంగా గడిపిన వీడియో పోర్న్ సైట్‍లో
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిజిటల్ యుగంలో వ్యక్తుల ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారింది. ఏ రూపంలో వ్యక్తిగత గోప్యత బజారుపాలవుతోందో ఊహించే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. తాజాగా ఓ వ్యక్తికి తన ప్రియురాలితో ఏకాంతంగా గడిపిన ఓ సంఘటన ఇప్పుడు పీడకలగా మారింది. తనకున్న అలవాటు కొద్దీ పోర్న్ సైట్ బ్రౌజ్ చేస్తుండగా అందులో తన ప్రియురాలితో తాను శృంగారం చేసుస్తున్న వీడియో ప్రత్యక్షం కావడం చూసి అతడు షాక్ తిన్నాడు. దీంతో ఈ వీడియో ఇందులో ఎక్కడిది అని ఆలోచించగా మూడేళ్ల క్రితం నాటిదని గుర్తు చేసుకున్నాడు. ఇదంతా తమకు తెలియకుండా రికార్డు చేసిన అడల్ట్ కంటెంట్ సైట్లలో అప్ లోడ్ చేశారని గుర్తించి కంగుతిన్నాడు.

వీక్షకుడు కాస్త బాధితుడిగా:

హాంకాంగ్‍కు చెందిన ఎరిక్ (ఇది అతడి అసలు పేరు కాదు) తన ప్రియురాలితో కలిసి 2023లో దక్షిణ చైనా షెన్‍జెన్‍లోని ఒక హోటలో బస చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తన దేశానికి వెళ్లిపోయారు. అయితే తనకు తరచుగా ఓ అడల్ట్ కంటెంట్ వెబ్ సైట్‍లో వీడియోలను చూసే అలవాటు ఎరిక్‍‍కు ఉంది. ఓ రోజు అతడు ఆ వెబ్‍సైట్ బ్రౌజ్ చేస్తుండగా అకస్మాత్తుగా ఓ వీడియో అతడిని ఆకర్శించింది. అందులో ఉన్న సన్నివేశాలు తన అనుభవంలో ఉన్నట్లు అనిపించింది. అలా కాసేపు వీడియోను చూసిన ఎరిక్ ఒక్కసారిగా షాక్‍కు గురయ్యాడు. ఆ వీడియోలో ఉన్నది వెరే ఎవరో కాదు. తాను తన ప్రేయసి అని గుర్తించాడు. తాము చైనా పర్యటలో ఉండగా హోటల్ గదిలో ఏకాంతంగా గడిపిన వీడియోనే అదంతా అని గుర్తించాడు. దీంతో ఇన్నాళ్లు సదరు పోర్న్ వెబ్ సైట్‍కు ప్రేక్షకుడిగా ఉన్న ఎరిక్ ఒక్కసారిగా బాధితుడిగా మారిపోయాడు. దీంతో తన అనుభవాన్ని గుర్తు చేసుకుని ఇది చాలా భయానకం అని ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించాడు.

తమ వారు చూశారేమోనని భయం:

ఈ వీడియో విషయాన్ని ఎరిక్ తన ప్రియురాలికి చెప్పినప్పుడు తొలుత ఆమె నమ్మలేదని కానీ వీడియో చూసిన తర్వాత తీవ్ర భయానికి గురైందని అతడు చెప్పుకొచ్చాడు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులు ఇప్పటికే ఆ వీడియో చూసి ఉంటారేమో అనే ఆందోళన ఆమెను వేధించిందని చెప్పారు. ఈ ఘటన తర్వాత కొన్ని వారాల పాటు తాము పరస్పరం మాట్లాడుకోలేకపోయామని అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్తే టోపీలు ధరిస్తూ ముఖాన్ని ఎవరికి చూపించుకోలేకపోతున్నామని చెప్పారు. అలాగే హోటళ్లకు దూరంగా ఉంటున్నామని తెలిపాడు. ఈ దెబ్బకు తాను స్పై క్యామ్ పోర్న్ (Spy Cam Scandal) చూడటం మానేశానని అప్పుడప్పుడు ఆ వీడియో మళ్లీ ఎక్కడైనా అప్‌లోడ్ అయిందో లేదో చూసేందుకు మాత్రమే వెబ్‌సైట్‌లను సందర్శిస్తానని తెలిపాడు. అయితే చైనాలో పోర్న్ క్రియేట్ (China Spycam) చేయడం, షేర్ చేయడం చట్టవిరుద్ధమైనప్పటికీ, స్పై-క్యామ్ పోర్న్ దాదాపు పదేళ్లుగా కొనసాగుతోందనే టాక్ ఉంది. ఇవి సాధారణంగా హోటల్ గదుల్లో రహస్యంగా చిత్రీకరించబడుతున్నాయని తెలుస్తోంది.

Next Story