Breaking News : వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ క్రీడాకారిణి మృతి

by Muthe.Rajitha |   (  Updated:2025-02-19 13:58:26  IST  )

రాజస్థాన్(Rajasthan) లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.

Breaking News : వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ క్రీడాకారిణి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్(Rajasthan) లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్(Weight Lifting) చేస్తూ.. అనుకోకుండా క్రీడాకారిణి ప్రమాదానికి గురయ్యి మృత్యువాత పడింది. రాజస్థాన్ లోని బికనేర్(Bikaner) లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యస్తీక ఆచార్య అనే పవర్ లిఫ్టింగ్(Power Lifting) క్రీడాకారిణి జిమ్ లో ప్రాక్టీస్ చేస్తోంది. కోచ్ సమక్షంలో 270 కిలోల బరువులు ఎత్తుతుండగా.. ప్రమాదవశాత్తూ ఆ బరువులతో కూడిన రాడ్డు ఆమె మెడపై పడటంతో యస్తీక అక్కడికక్కడే కుప్పకూలింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా ఈ ఘటనలో కోచ్ కు సైతం స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. ఇక యస్తీక గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. త్వరలో జరగబోయే మరో నేషనల్స్ కు ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆమె తోటి వారు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రమాద వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

for video link

Next Story