- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
250 మందితో చెన్నైకి స్పెషల్ ట్రైన్ (వీడియో)
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో క్షేమంగా బయటపడిన 250 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో చెన్నై తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో క్షేమంగా బయటపడిన 250 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో చెన్నై తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు నెంబర్ P/13671 భద్రక్ స్టేషన్ నుంచి బయల్దేరి.. బహనాగలో ప్రయాణికులను ఎక్కించుకోనుంది. ఆ తర్వాత ఇవాళ రాత్రి 9.30కి విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అక్కడ 9 మంది ప్రయాణికులు దిగుతారని చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం..బ్రహ్మపురలో నలుగురు ప్రయాణికులు దిగగా.. 41 మంది విశాఖపట్నం, రాజమహేంద్రవరంలో ఒకరు, తాడేపల్లిగూడెంలో ఇద్దరు, చెన్నైలో 133 మంది ప్రయాణికులు దిగుతారని దక్షిణ మధ్య రైల్వే డివిజినల్ అధికారి తెలిపారు. ఆదివారం ఉదయానికి ఈ రైలు చెన్నై చేరుకుంటుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Next Story






